Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కు యత్నం?

బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కు యత్నం?

వార్త 3 months ago

Bandi Bhagirath Case: తల్లితండ్రులు ఎంతో కష్టపడి పైకి వస్తారు. వివిధ రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటారు. సమాజసేవే తమ కర్తవ్యంగా భావించి, ఆయారంగాల్లో ప్రవేశించి, తమతమ సత్తాను చాటుకుంటారు.

కేంద్ర బీజేపీ మంత్రి బండి సంజయ్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను, గుర్తింపును పొందారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ, నేడు కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. అయితే ఆయన కుమారుడు బండి సాయి భగీరధ్ పై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ 17ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి, బండిసాయి భగీరధ్ అత్యాచారానికి పాల్పడ్డాడడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read also: YS Jagan: అనంతలో రాష్ట్ర నేతల హడావుడి.. మూడు రోజులు ముగ్గురు నేతలు

 Bandi Bhagirath Pocso Case Investigation

Bandi Bhagirath Case: ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు

మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్ తో పాటు మరో రెండు ప్రాంతాల్లో తమ కూతురిపై ఆయన అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండి సాయి భగీరధ్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. బిఎన్ ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 ఆర్/డబ్లూ 12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరధ్ పై కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. తమ కూతురు రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలిక తల్లిదండ్రులు.

రాజకీయ కుట్ర అంటూ బండి సంజయ్ వాదన

బండి సంజయ్ వర్షన్ మరోలా ఉంది.. తమను హనీట్రాప్ చేసి 5కోట్లు డిమాండ్ చేశారని.. 50వేల రూపాయలు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. అయితే బండీ భరీరద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా విశ్వసనీయత సమాచారం. గతమూడురోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తున్నది. అంతేకాక ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్నది. రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బండి సంజయ్ రాజీనామా చేయాలి: కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha