Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

వార్త 2 weeks ago

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ కీలక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎంఏవై-జి (PMAY-G) ఇండ్ల కేటాయింపు, ఎల్నినో పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు.

పిఎంఏవై-జి పథకంలో భాగంగా మొదటి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత జూలైలో ఢిల్లీలో కలిసినప్పుడు రాష్ట్రంలోని 11,56,915 మంది అర్హులైన గ్రామీణ పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. మొదటి విడత పోను, రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలి ఉన్న 9.56 లక్షల ఇండ్లను కూడా వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు.

Read Also : KTR Formula E Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ వాయిదా

 CM Revanth Reddy holds a key meeting with Union Minister Shivraj Singh Chouhan.

CM Revanth Reddy: ఎల్నినో ప్రభావంపై కేంద్రం సహకరించాలి

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ, ఎల్నినో పరిస్థితుల ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని, అయితే తాగునీరు మరియు విద్యుత్ కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. ఈ ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సన్నబియ్యం బోనస్, ప్రత్యామ్నాయ పంటలు

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఎల్నినో దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటలు మరియు పంట మార్పిడి వైపు ప్రోత్సహించేందుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేలా 250 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

'రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ ఇస్తాం'.. సీఎం ఆరోపణలపై KTR సవాల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha