Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ ఇస్తాం'.. సీఎం ఆరోపణలపై KTR సవాల్

'రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ ఇస్తాం'.. సీఎం ఆరోపణలపై KTR సవాల్

వార్త 2 weeks ago

KTR Press Meet: ఫార్ములా ఈ-రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కనపెట్టి, బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక ఏజెండాగా మారిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

Read Also : Nizamabad Reserve Inspector: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదం.. తుపాకీ పేలి ఆర్‌ఐ సతీశ్ మృతి

 “Pay Rs 1,000 crore and take all the assets” - KTR challenges CM’s allegations.

కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఒక సంచలన ఆఫర్ విసిరారు. “మా కుటుంబ ఆస్తులన్నింటినీ ప్రభుత్వమే తీసుకుని, దానికి ప్రతిఫలంగా మాకు కేవలం రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. మిగిలిన రూ. 99,000 కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేయండి” అని సవాల్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము రాత్రింబవళ్లు శ్రమిస్తే, రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

KTR Press Meet: భూకేటాయింపుల ప్రచారంపై అసెంబ్లీ వ్యాఖ్యలను గుర్తుచేసిన కేటీఆర్

భూకేటాయింపుల ఆరోపణలపై మాట్లాడుతుండగా, గతంలో కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూమి ఉందంటూ తీవ్ర అసత్య ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్‌కు ఉన్నది కేవలం 67 ఎకరాలేనని ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమను బెదిరించలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేధింపులను న్యాయస్థానాల ద్వారా న్యాయపరంగాను, ప్రజల మధ్యన రాజకీయంగానూ సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ వాయిదా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha