Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రానికి చంద్రబాబు లేఖ

కేంద్రానికి చంద్రబాబు లేఖ

వార్త 6 days ago

Chandrababu Letter : ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం ఒక లేఖ రాశారు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల వల్ల మ్యాంగో పల్ప్ (మామిడి గుజ్జు) ఎగుమతులు నిలిచిపోయాయని, దీని ప్రభావం స్థానిక మార్కెట్‌పై తీవ్రంగా పడిందని ఆయన లేఖలో వివరించారు. ఎగుమతులు లేకపోవడంతో ప్రాసెసింగ్ పరిశ్రమలు మామిడి కొనుగోళ్లను నిలిపివేశాయని, ఫలితంగా తోతాపురి రకం మామిడి ధరలు మార్కెట్‌లో ఒక్కసారిగా పడిపోయి రైతులు భారీ నష్టాల్లో కూరుకుపోయారని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

Read Als o : జూన్ 30న ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

 Jonnagiri Gold Mine Project

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు

జూన్ నుండి ఆగస్టు వరకు తోతాపురి మామిడి కొనుగోళ్ల సీజన్ కొనసాగుతుందని, ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి కోరారు. ధరల పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ (Market Intervention Scheme – రైతుల మద్దతు ధరల జోక్య పథకం) అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ (PDPS – ధరల వ్యత్యాస చెల్లింపు పథకం) కింద రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం రూ. 281 కోట్ల రూపాయల తక్షణ సహాయాన్ని మంజూరు చేయాలని చంద్రబాబు తన లేఖలో గట్టిగా డిమాండ్ చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందించి ఈ నిధులు విడుదల చేస్తేనే మామిడి సాగుదారులను సంక్షోభం నుండి గట్టెక్కించగలమని సీఎం పేర్కొన్నారు.

రెండో భార్య కూతుళ్లకు ఆస్తిలో సమాన హక్కు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha