Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండో భార్య కూతుళ్లకు ఆస్తిలో సమాన హక్కు

రెండో భార్య కూతుళ్లకు ఆస్తిలో సమాన హక్కు

వార్త 6 days ago

AP High Court: వంశపారంపర్య ఆస్తి కోసం కన్న తండ్రి పవిత్ర బంధాన్ని, తోబుట్టువుల పుట్టుకను అవమానిస్తూ ఒక కుమారుడు దశాబ్ద కాలంగా చేసిన కుటిల న్యాయపోరాటం చివరకు పరాభవంతో ముగిసింది.

“తండ్రికి రెండో పెళ్లే కాలేదు.. ఆ ఆరుగురు అమ్మాయిలు నా తండ్రికి పుట్టిన బిడ్డలే కాదు.. వారు వివాహేతర సంబంధంతో పుట్టినవారు!” అంటూ తీవ్ర నిందలు వేసిన అన్న అహంకారాన్ని హైకోర్టు అణచివేసింది. “చట్టబద్ధమైన సంతానానికి, వంశపారంపర్య ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది” అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక సంచలన తీర్పునిచ్చింది. ఈ ఉద్వేగభరితమైన సుదీర్ఘ న్యాయపోరాటంలో చివరకు ధర్మమే గెలిచి, రెండో భార్య కుమార్తెలు విజేతలుగా నిలిచారు.

Read Also :Ambati Rambabu: వైసీపీ నేతలు అంబటి, పేర్ని నానిలపై అట్రాసిటీ కేసు నమోదు

ఆస్తి కోసం రగిలిన చిచ్చు.. సోదరీమణులపై దారుణ నిందలు

కాకినాడ సమీపంలోని గైగోలుపాడుకు చెందిన తురంగి సోమరాజు కుటుంబంలో ఈ ఆస్తి వివాదం రాజుకుంది. సోమరాజు మొదటి భార్య మరణించిన తర్వాత, ఆయన రాఘవమ్మ అనే మహిళను చట్టబద్ధంగా రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరుగురు కుమార్తెలు జన్మించారు. సోమరాజు మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ కన్ను తాతల కాలం నాటి వంశపారంపర్య ఆస్తిపై పడింది. ఆస్తి మొత్తం తనకే దక్కాలనే దురాశతో.. తండ్రి రెండో వివాహాన్ని, తన ఆరుగురు సోదరీమణులను కుటుంబ సభ్యులుగా గుర్తించేందుకు సత్యనారాయణ నిరాకరించాడు. ఒక అడుగు ముందుకేసి, వారిని సమాజంలో చులకన చేసేలా “వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన వారు”గా చిత్రీకరిస్తూ కోర్టును ఆశ్రయించాడు. తమకు ఆస్తిలో న్యాయబద్ధమైన వాటా కావాలని కోరుతూ సోమరాజు, ఆయన రెండో భార్య కుమార్తెలు కోర్టులో దావా వేశారు. దీనిని కౌంటర్ చేస్తూ సత్యనారాయణ సరికొత్త డ్రామాకు తెరలేపాడు. తన తండ్రి సోమరాజు గతంలోనే ఆస్తి హక్కులను కేవలం రూ. 80 వేలకే వదులుకున్నారని (Relinquished Rights), తండ్రికే హక్కు లేనప్పుడు ఇక రెండో భార్య కూతుళ్లకు ఆస్తిలో వాటా ఎక్కడి నుంచి వస్తుందంటూ కొత్త వాదనను ముందుకు తెచ్చాడు.

AP High Court: హైకోర్టు తీర్పు – కన్నబిడ్డల హక్కులను కాలరాయలేరు!

ఈ సుదీర్ఘ వివాదంలో ఇరుపక్షాల వాదనలను, పత్రాలను సునిశితంగా పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు సత్యనారాయణ తీరుపై తీవ్ర అసహనం మరియు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తోబుట్టువుల పుట్టుకను అవమానించడాన్ని తప్పుబడుతూ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒకవేళ ఒక తండ్రి తన ఆస్తి హక్కులను వదులుకున్నాడంటే, అది కేవలం ఆయన వ్యక్తిగత వాటాకు మాత్రమే పరిమితం అవుతుంది. అంతేకాని, ఆ నిర్ణయం ఆయన కన్నబిడ్డల న్యాయబద్ధమైన వారసత్వ హక్కులను ఏమాత్రం కాలరాయలేదు. ఆ ఆరుగురు కుమార్తెలు సోమరాజుకు జన్మించిన చట్టబద్ధమైన సంతానమేనని అన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.”

ఆరుగురు కుమార్తెలకు వంశపారంపర్య ఆస్తిలో సమాన వాటా (Equal Share in Ancestral Property) దక్కాల్సిందేనని తేల్చిచెప్పిన హైకోర్టు.. తండ్రిని, సోదరీమణులను అవమానిస్తూ సత్యనారాయణ దాఖలు చేసిన అప్పీల్‌ను పూర్తిగా కొట్టివేసింది. కోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని, తమ పటిష్టమైన ఆత్మగౌరవం నిలబడిందని ఆ ఆరుగురు సోదరీమణులు కోర్టు ప్రాంగణంలోనే కన్నీటి పర్యంతమయ్యారు.

వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్లు: సీఎం హామీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha