Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రానికి మమత సవాల్

కేంద్రానికి మమత సవాల్

వార్త 3 months ago

బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతున్న తరుణంలో, మే 9వ తేదీని 'బ్లాక్ డే' (నల్ల దినం)గా పాటిస్తామని మమత ప్రకటించారు. మే 9న రవీంద్ర జయంతి సందర్భంగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓడిపోయినా తమ పోరాటం ఆగదని, ఈ ఎన్నికల అక్రమాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆమె బలంగా నమ్ముతున్నారు.

Read Also : తీస్తా ఒప్పందంపై కొత్త ఆశలు పెంచిన బెంగాల్ ఫలితం

అయోమయంలో బెంగాల్ యంత్రాంగం

మరోవైపు, పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మే 9న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అయితే మమత ఇంకా పదవిలోనే ఉండటం, తన నివాసం వద్ద భద్రతను తగ్గించినప్పటికీ ఆమె మొండిగా వ్యవహరించడం చూస్తుంటే బెంగాల్‌లో రాబోయే రోజులు మరింత ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తున్నాయి. ఒక పక్క కోర్టు యుద్ధం, మరోపక్క వీధి పోరాటాలతో బెంగాల్ రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తమిళనాడు సీఎంగా పళనిస్వామి..నిజామా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha