Smriti Mandhana:: భారత మహిళల క్రికెట్ జట్టు నూతన సారథిగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ స్మృతికి ఈ పగ్గాలను అప్పగించింది.
ఈ నేపథ్యంలో హర్మన్‌ను ఉద్దేశించి స్మృతి భావోద్వేగ పోస్ట్ చేసింది.
ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా..
పదేళ్ల నాయకత్వం ఓ అద్భుతం
“ఇన్ని సంవత్సరాలు మీతో కలిసి ఆడటం ఒక గొప్ప అనుభూతి. మీ పదేళ్ల కెప్టెన్సీ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. రాబోయే రోజుల్లో మన దేశానికి మరిన్ని విజయాలు, గౌరవాన్ని అందించడానికి కలిసికట్టుగా కృషి చేస్తాం” అని రాసుకొచ్చింది.

హర్మన్‌ప్రీత్ ఘనమైన ప్రయాణం
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా పలు చారిత్రక విజయాలు సాధించింది. ఆమె కెప్టెన్సీలోనే భారత్ 2025 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో పాటు ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. బీసీసీఐ ప్రతినిధులతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ వైదొలగాలని నిర్ణయించుకుంది.
నాయకత్వ అనుభవంతో స్మృతి
30 ఏళ్ల స్మృతి మంధాన 2013 నుంచి భారత జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000కు పైగా పరుగులు సాధించింది. గతంలో తాత్కాలికంగా 18 టీ20లు, 4 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. అంతేకాకుండా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును 2024, 2026 లీగ్‌లలో విజేతగా నిలిపి తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది.
Epaper: epaper.vaartha.com
అజిత్ అగార్కర్‌పై గంభీర్ ప్రశంసలు.. చరిత్ర గుర్తుంచుకుంటుంది!

