Dailyhunt
Kerala: అవయవదాత చిన్నారికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు

Kerala: అవయవదాత చిన్నారికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు

వార్త 1 month ago

Kerala: కేరళలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన హృదయ విదారక సంఘటన ఇది. కేవలం 10 నెలల వయసులోనే అవయవదాతగా మారిన చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది.

ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఈ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను కలిచివేశాయి.

Bengaluru House Rents: రూ. 80 వేలకు అద్దె ఫ్లాట్.. సూర్యకాంతి కారణమా?

పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గన్నారు. ద్ణుఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్‌ అబ్రహం, షెరిన్‌ ఆన్‌ జాన్‌ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు. ఈ నెల 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్‌ తీవ్రంగా గాయపడింది.

ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవించే ఉంటుంది

తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఈ నెల 12న బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు ద్ణుఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్‌ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు.

'మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు' అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశంసించారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తాను నివాళులర్పించేందుకు వచ్చానని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి తెలిపారు. ఆ చిన్నారి శరీరం మట్టిలో కలిసినా, ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవించే ఉంటుందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

NewTaxlaw 2026: ఉద్యోగులకు, సామాన్యులకు ఊరట!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha