Kerala Influencer Akhil Megha:నేటి కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో అంచనా వేయడం చాలా కష్టమైపోయింది. తెర వెనుక ఒక నిజం ఉంటే కెమెరా ముందుకు వచ్చి మరొక నిజం చూపించే జంటలు కోకొల్లలుగా ఉన్నారు.
కేరళ రాష్ట్రానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జోడీ అఖిల్ మేఘ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. వీరు చేసే ప్రతి వీడియోలో అన్యోయమైన దాంపత్య జీవితాన్ని చూపిస్తూ ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న ఈ జంట జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రోజు ఉదయం లేచి చూసేసరికి ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. అందరూ సంతోషంగా ఉంటారనుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెను తుఫాను బద్దలయింది. భార్య మేఘ తన భర్తను అకస్మాత్తుగా వదిలి వెళ్ళిపోవడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. ఈ సంఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారి అందరినీ షాక్ కు గురి చేసింది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఇలా విడిపోవడం చూసి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
Read also: Prakash Raj voter list controversy: ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపుపై స్పందించిన ఎన్నికల కమిషన్
Kerala social media influencer Akhil Megha
బస్సు క్లీనర్ తో భార్య పరారవ్వడం వెనుక అసలు నిజాలు
సోషల్ మీడియాలో ఎంతో పేరు సంపాదించుకున్న అఖిల్ మేఘ జీవితంలో ఈ నాటకీయ పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన భార్య మేఘ తనను పూర్తిగా మోసం చేసి ఒక సాధారణ లోకల్ బస్సు క్లీనర్ తో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని భర్త అఖిల్ వీడియో ద్వారా వెల్లడించాడు. కేవలం భర్తను వదిలి వెళ్ళడమే కాకుండా ఇంట్లో ఉన్న నగదు బంగారం విలువైన వస్తువులను సైతం ఆమె తీసుకువెళ్ళినట్లు ఆరోపణలు చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో క్షణాల వ్యవధిలో వైరల్ గా మారి పెద్ద చర్చకు దారితీసింది. కోట్లు సంపాదిస్తున్న ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ అయి ఉండి సాధారణ బస్సు క్లీనర్ తో భార్య వెళ్లిపోవడం ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన కేవలం ఒక భార్యాభర్తల గొడవ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కనిపించే బంధాల డొల్లతనాన్ని బయటపెట్టింది. కెమెరా ముందు నవ్వుతూ నటించే వారు నిజ జీవితంలో ఎంతటి మానసిక వేదన అనుభవిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అఖిల్ తన బాధను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటూ బోరున విలపించడం చూసి ప్రజలు కూడా చలించిపోతున్నారు.
Kerala Influencer Akhil Megha:సోషల్ మీడియా జీవితాల వెనుక ఉండే చేదు నిజాలు
ఈ ఉదంతం ద్వారా సోషల్ మీడియాలో అందంగా కనిపించే ప్రతి జీవితం నిజమైనది కాదని స్పష్టమవుతోంది. కెమెరా ఆన్ లో ఉన్నంతవరకు అందరూ సంతోషంగా ఉన్నట్లు నటించడం కేవలం వ్యూస్ మరియు ఫాలోవర్స్ కోసం మాత్రమే అని తేలిపోయింది. అఖిల్ మేఘ వివాదంలో మేఘ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా సమాధానం ఇప్పటివరకు రాలేదు. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే ఆధారంగా సాగుతున్న ఈ ప్రచారంలో పూర్తి నిజాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది. ప్రముఖుల జీవితాలు కూడా నిమిషాల వ్యవధిలో ఇలాంటి వివాదాల కారణంగా రోడ్డున పడటం చూసి సామాన్య ప్రజలు ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎటు దారితీస్తుంది అనే దానిపై కేరళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

