Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపుపై స్పందించిన ఎన్నికల కమిషన్

ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపుపై స్పందించిన ఎన్నికల కమిషన్

వార్త 1 week ago

Prakash Raj voter list controversy: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, పూర్తిగా నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేలో భాగంగా అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు, ప్రకాశ్ రాజ్ నాలుగేళ్ల క్రితమే తన నమోదిత చిరునామా నుంచి వేరే ప్రాంతానికి మారినట్లు వెల్లడైందని ఈసీ తెలియజేసింది.

Read Also : Mega 158 Movie: తన 158వ సినిమా టైటిల్‌ను లీక్ చేసిన చిరంజీవి

 Election Commission responds to the deletion of Prakash Raj’s vote.

Prakash Raj voter list controversy: నిబంధనల ప్రకారమే చర్యలు.. ఈసీ స్పష్టత

తాను వేరే చోట నివసిస్తున్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ స్వయంగా అంగీకరించారని ఎన్నికల కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. ఆయన తన ప్రస్తుత కొత్త చిరునామా ఆధారంగా ఓటు హక్కును పునరుద్ధరించుకోవడానికి వెంటనే ఫారమ్ 6 దాఖలు చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదా పొరపాటు లేదని, నివాస స్థల మార్పు వల్లే జాబితాలో సవరణలు జరిగాయని ఈసీ వివరించింది.

ఈసీ చర్యలపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం, ఆరోపణలు

అంతకుముందు, బెంగళూరులోని తన సొంత నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమవ్వడంపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను పుట్టి పెరిగిన ఊర్లోనే తన ఓటు హక్కును తొలగించడం శోచనీయమని, ఇదొక పెద్ద జోక్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేవలం తన ఒక్కడిదే కాకుండా ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఏది ఏమైనా న్యాయపోరాటం చేసి లేదా దరఖాస్తు చేసుకుని తన ఓటును మళ్లీ సాధించుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. ఈ వివాదం తీవ్రం కావడంతోనే ఈసీ అధికారికంగా వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.

సింహాసనం కోసం రక్తపాతం.. 'మిర్జాపూర్' ట్రైలర్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha