Dailyhunt
కేరళలో కాంగ్రెస్ ప్రభంజనం

కేరళలో కాంగ్రెస్ ప్రభంజనం

వార్త 5 days ago

Kerala Election Results: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభంజనం సృష్టించడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పండుగ చేసుకుంటున్నారు.

సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘గాంధీభవన్’ వద్ద విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి.

Read Also : TVK Party: TVK జెండా రంగు చీరలో త్రిష, విజయ్ స్టెప్పులు..

 Kerala Election Results

గాంధీభవన్‌లో పండుగ వాతావరణం

ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, డీసీసీ అధ్యక్షులు రోహిత్ మోత ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ జయహో రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. కేరళ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు దేశ రాజకీయాల్లో మార్పుకు సంకేతమని వారు ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన విజయం

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కేరళలో యూడీఎఫ్ సాధించిన ఈ భారీ విజయం రాహుల్ గాంధీ కష్టానికి, ఆయన నాయకత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునర్వైభవానికి ఈ ఫలితాలే నాంది అని, రాబోయే రోజుల్లో దేశమంతటా ఇదే ఫలితం పునరావృతమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

TVK జెండా రంగు చీరలో త్రిష, విజయ్ స్టెప్పులు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha