Dailyhunt
కేరళలో రేవంత్ ప్రచారం చేసిన చోట్ల ఫలితం ఇదే!

కేరళలో రేవంత్ ప్రచారం చేసిన చోట్ల ఫలితం ఇదే!

వార్త 5 days ago

Kerala Election Results: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) కేరళ గడ్డపై అప్రతిహత విజయం దిశగా దూసుకుపోతోంది.

మొత్తం 140 స్థానాలకు గానూ యూడీఎఫ్ ఏకంగా 98 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ, అధికారానికి అవసరమైన మేజిక్ ఫిగర్ (71)ను అలవోకగా దాటేసింది. దశాబ్ద కాలంగా కేరళను శాసిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని (LDF) కేవలం 40 స్థానాలకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బతింది. కేరళ ఓటర్లు పదేళ్ల ఎల్‌డీఎఫ్ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు.

రేవంత్ రెడ్డి ‘నీ పో మోనే విజయన్’ డైలాగ్ హిట్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం యూడీఎఫ్ విజయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తిరువనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మలయాళ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ నీ పో మోనే విజయన్’ అంటూ చేసిన వ్యాఖ్యలు కేరళ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పినరయి విజయన్ పొలిటికల్ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిందని, ఆయన మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఓటర్లను ఆలోచింపజేశాయి.

Read Also : TVK Party: TVK జెండా రంగు చీరలో త్రిష, విజయ్ స్టెప్పులు..

Kerala Election Results: రేవంత్ వర్సెస్ విజయన్.. ట్విట్టర్ వార్

ప్రచార పర్వంలో రేవంత్ రెడ్డి, పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించినట్లే, కేరళలో విజయన్‌ను ఇంటికి పంపుతామని రేవంత్ సవాల్ చేయగా.. విజయన్ కూడా అదే స్థాయిలో స్పందించారు. కేరళ అభివృద్ధి సూచీలను ప్రస్తావిస్తూనే, రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలను పరోక్షంగా ఎద్దేవా చేస్తూ విజయన్ కౌంటర్ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, “విజయన్ కి ఓటు వేయడం అంటే మోదీకి ఓటు వేయడమే” అని ప్రచారం చేస్తూ ఎల్‌డీఎఫ్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్న వాదనను బలంగా వినిపించారు.

ఫలించిన రేవంత్ రెడ్డి వ్యూహం

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రచారం కేరళలోని తటస్థ ఓటర్లపై, ముఖ్యంగా యువతపై బలమైన ప్రభావం చూపింది. విజయన్ మరియు బీజేపీ ఒక్కటేనని రేవంత్ చేసిన ‘సీక్రెట్ డీల్’ ప్రచారం కమ్యూనిస్ట్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకును దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో మాదిరిగానే కేరళలోనూ అధికార వ్యతిరేకతను ఒడిసిపట్టడంలో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయని, యూడీఎఫ్ సాధిస్తున్న ఈ భారీ విజయంలో రేవంత్ రెడ్డి ప్రచారం కీలక పాత్ర పోషించిందని విశ్లేషిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ద్రవిడ కోటలో స్టాలిన్ వ్యూహం ఎందుకు విఫలమైంది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha