Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళం వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

కేరళం వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

వార్త 1 month ago

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి త్వరలో కేరళ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వరుస రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు మరియు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ అధికారిక బాధ్యతలతో తీరికలేకుండా గడుపుతున్న ఆయన, తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి (Pawan Kalyan ) పెట్టాలని నిర్ణయించుకున్నారు.

వెన్నునొప్పి సమస్యతో :

గతంలో తీవ్రంగా వేధించిన వెన్నునొప్పి సమస్యతో పాటు, ఇటీవలే ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగడంతో శరీరం పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు కేరళలోని ఒక ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో ఆయన సుమారు 20 రోజుల పాటు బస చేయనున్నట్లు సమాచారం.

ఆయుర్వేద మరియు ఆయుర్వేద ప్రకృతి చికిత్స ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి పొందడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు నాడీ వ్యవస్థ, శరీర ఆరోగ్య సమతుల్యత పునరుద్ధరణ కోసం ఆయన ప్రత్యేక థెరపీలు తీసుకోనున్నారు.రాబోయే మూడు వారాల పాటు ఆయన క్రియాశీలక రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.

చికిత్స పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాతే ఆయన మళ్లీ ప్రజా సేవ, డిప్యూటీ సీఎంగా తన నిత్య విధుల నిర్వహణలో ముమ్మరంగా పాల్గొంటారని సమాచారం.

జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha