Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీ వేణుగోపాల్‌కు సీఎం పదవి ఎందుకు దక్కలేదు? అసలు నిజం ఇదీ!

కేసీ వేణుగోపాల్‌కు సీఎం పదవి ఎందుకు దక్కలేదు? అసలు నిజం ఇదీ!

వార్త 3 months ago

KC Venugopal Kerala CM : కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాజకీయ ప్రస్థానంలో ఒక ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఖరారు చేయడంలో కింగ్ మేకర్‌గా వ్యవహరించిన ఆయన, సొంత రాష్ట్రం కేరళలో మాత్రం ఆ పదవికి తృటిలో దూరమయ్యారు. రాహుల్ గాంధీ, ఖర్గే తర్వాత పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన వేణుగోపాల్ విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కింగ్ మేకర్‌గా విజయాలు.. సొంత రాష్ట్రంలో సవాలు

కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గొడవను సర్దుమణిగి సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించినా.. తెలంగాణలో రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టినా.. ఆ ఘనత వేణుగోపాల్‌కే దక్కుతుంది. అయితే, మే 4న కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి 102 సీట్లతో ఘనవిజయం సాధించాక, వేణుగోపాల్ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై పోరాడిన వీడీ సతీశన్‌కే మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సమీకరణాలు మారిపోయాయి.

Read Also:Sugar Export Ban India: భారత్ నుంచి చక్కెర ఎగుమతులు నిలిపివేత

 KC Venugopal Kerala CM

జాతీయ రాజకీయాల కోసమే త్యాగమా?

ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉంటూ ఏఐసీసీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేణుగోపాల్‌ను ఒక రాష్ట్రానికే పరిమితం చేయడం పార్టీకి నష్టమని హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీ సమన్వయం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఆయనను ఢిల్లీ రాజకీయాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా మరియు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈసారి చేజారడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నీట్ రద్దు చేయండి.. 12వ తరగతి మార్కులే ప్రామాణికం కావాలి: సీఎం విజయ్ డిమాండ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha