Uttam Kumar Reddy:రైతు దీక్షలు మరియు పాదయాత్రల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తే కేసీఆర్ పాదయాత్ర మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.
లక్ష మందితో పాదయాత్ర చేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటనపై అసెంబ్లీ మీడియా హాల్ లో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు నవ్వుతారని కాబట్టి యాత్రలు మాని ఇంటిలో విశ్రాంతి తీసుకోవడమే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Uttam Kumar Reddy makes sensational comments.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు
నీటి సమస్య మరియు ఎల్ నినో ప్రభావంతో పాటు కేసీఆర్ విధానాల వల్లనే రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు మళ్లీ వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన భాషనే ఆయనపై ప్రయోగిస్తే ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు.
Uttam Kumar Reddy:రాజకీయ విమర్శల పర్వం
ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలు అన్నీ కేవలం రాజకీయ లబ్ది కోసమే అని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతుంటే భరించలేక ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

