Indiramma illu:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వచ్చే బోనాల పండుగ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకుని ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
Read also: Mulugu : మంత్రి సీతక్క ఇలాకాలో కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు
Indiramma houses to be completed by Bonalu.
పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ స్పష్టత
గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కేటాయింపు సరిగ్గా జరగలేదని మంత్రి విమర్శించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా పట్టాలు ఇచ్చినా చాలామంది ఆ ప్రాంతాల్లో నివాసం ఉండలేదని తెలిపారు. పట్టణాలు లేదా నగరాలకు దూరంగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం పేదలు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
Indiramma illu:డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రత్యేక సమీక్ష
గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆ ఇళ్లలో నివసించే వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి స్వప్నం సాకారమయ్యేలా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Epaper: epaper.vaartha.com
అసెంబ్లీలో 'దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాల్'.. ప్రారంభించిన సీఎం!

