KCR Resign : తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
కేసీఆర్ రాజీనామా అంశంపై రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధిస్తూ, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తేమీ కాదని, గతంలో ఆయన చేసిన రాజీనామాలతోనే ఢిల్లీ పీఠం వణికిపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామా దెబ్బకే అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం భయపడి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారని వ్యాఖ్యానించారు. ఒకవేళ కేసీఆర్ కనుక ఇప్పుడు రాజీనామా చేస్తే, ఆ నిర్ణయ తీవ్రతను తట్టుకునే శక్తి ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వానికే లేదని, అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోగలరా అని ప్రెస్ మీట్‌లో సూటిగా ప్రశ్నించారు.

శాంతిభద్రతల క్షీణతపై తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల కుమారులు దౌర్జన్యాలు చేస్తున్నారని, ఇతర పార్టీల ఎంపీల కుమారులు ప్రయాణికులను వాహనాలతో గుద్ది చంపినా పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధికార బలం చూపి నేరస్థులను కాపాడుతున్న పోలీసు వ్యవస్థ వైఖరిని ఎండగడుతూ, కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ కరువైందని మండిపడ్డారు.
చంద్రబాబు కు చెంచాగిరి చేయడమే రేవంత్ పని - KTR కీలక వ్యాఖ్యలు

