Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ తోనే తెలంగాణ సాధన

కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ తోనే తెలంగాణ సాధన

వార్త 1 month ago

ద్యమానికి దిశా నిర్దేశం చేసిన పార్టీ బిఆర్ఎస్.

బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

BRS Formation Day: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక మలుపుగా నిలిచిందని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని పేర్కొన్నారు.మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు.

Read Also : Gummadidala: గోవులను జాతీయ ప్రాణిగా గుర్తించాలి: గౌసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్

 BRS formation celebrations in Medak.

BRS Formation Day: కేసీఆర్ నాయకత్వం, ప్రజా మద్దతు

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిన పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ ఒక వేదికగా మారిందన్నారు. కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల వల్లే ఉద్యమం సాఫల్యం సాధించిందని తెలిపారు.తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏకమై బిఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు పార్టీ నిరంతరం కృషి చేసిందన్నారు. ఆ పోరాట ఫలితంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు.

అభివృద్ధి పథంలో తెలంగాణ

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లిందన్నారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, పేదలకు గృహాలు, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అనేక పథకాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని వివరించారు. గ్రామీణ అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల మెరుగుదలలో కూడా ప్రభుత్వం విశేష కృషి చేసిందని తెలిపారు.

పార్టీ శ్రేణుల ఉత్సాహం

ప్రస్తుతం కూడా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తోందని, భవిష్యత్తులో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్,లింగారెడ్డి,కౌన్సిలర్లు దీపక్ కుమార్,సోహెల్, మాజీ కౌన్సిలర్ లు మాయ. మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, ఆర్కే శ్రీనివాస్,నాయకులు ప్రభు రెడ్డి, ఏనుగుల రాజు,గట్టేష్,సాదిక్, ఇందాడ్, సాయ గౌడ్, ఇస్మాయిల్, సునీల్, సాయికుమార్,మహిళా నాయకురాలు రాధా,లత తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త నిబంధనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha