Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

వార్త 2 months ago

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన, కేసీఆర్ కుటుంబంపై మరియు తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read also: Pollution : కాలుష్య కాసారమే!

 Telangana: I am recognized because of KCR: CM Revanth Reddy

రాముడు-రావణుడు.. కృష్ణుడు-శకుడు

తన రాజకీయ ఎదుగుదలకు కేసీఆరే కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్ గృహనిర్బంధంపై అనుమానం

ప్రస్తుతం కేసీఆర్ రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారన్న వార్తలపై రేవంత్ రెడ్డి కొత్త కోణాన్ని లేవనెత్తారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారేమోనన్న అనుమానం తనకు ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.

హరీష్ రావుపై ‘కాలనాగు’ వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావును “కాలనాగు” కంటే ప్రమాదకరమైన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆహార కల్తీ నియంత్రణకు అత్యాధునిక విధానాన్ని ప్రవేశపెడతాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha