Ketan Agarwalcase: మహారాష్ట్రలోని పుణెలో సంచలనం సృష్టించిన యువ రియల్టర్, వ్యాపారవేత్త కేతన్ (26) హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో మరిన్ని రహస్యాలను రాబట్టేందుకు నిందితులకు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించినప్పటికీ, అందుకు బ్రేక్ పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పాలిగ్రాఫ్ టెస్టులు చేయించుకోవడానికి నిరాకరించారు.
Read Also: EPFO update: EPFO ఆన్‌లైన్ సేవలు మళ్ళీ ప్రారంభం
Ketan Agarwal murder case: Siya and Chetan refuse polygraph test.
Ketan Agarwal case: కోర్టు నిబంధనతో తప్పిన పరీక్ష
చట్టప్రకారం నిందితుల సమ్మతి, అనుమతి ఉంటేనే పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని వడ్గావ్ మావల్ కోర్టు గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుల అభిప్రాయాన్ని కోరగా, వారు ఈ పరీక్షకు అంగీకరించలేదు. నిందితుల నుండి ఎలాంటి సమ్మతి రాకపోవడంతో న్యాయస్థానం పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి ఇవ్వలేదు. అనంతరం నిందితులిద్దరికీ 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, అధికారుల వారిని పుణెలోని ప్రముఖ ఎరవాడ కేంద్ర జైలుకు తరలించారు.
మరో నిందితుడిపై పోలీసుల అనుమానం
ఇదిలావుండగా, ఈ దారుణ హత్య వెనుక కేవలం ఈ ఇద్దరి ప్రమేయమే కాకుండా మరికొందరి హస్తం కూడా ఉండవచ్చని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ముఖ్యంగా కేతన్‌ను లోహగఢ్ కోటపై నుండి తోసి హత్య చేసిన వ్యవహారంలో.. నిందితుడు చేతన్ చౌదరి యొక్క ఒక క్లోజ్ ఫ్రెండ్ (స్నేహితుడు) ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ కోణంలోనే పోలీసులు తమ విచారణను మరింత వేగవంతం చేశారు. ఆ స్నేహితుడి పాత్రపై స్పష్టత వస్తే కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Epaper: epaper.vaartha.com
కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా, చేతన్‌లకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ

