Prakash Ambedkar: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తో వంచిత్ బహుజన్ అగాడీ (VBA) అధినేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక అంశాలు మరియు ప్రజా సమస్యలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతల పరిచయం
ఈ సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులను కేటీఆర్.. ప్రకాష్ అంబేద్కర్ కు పరిచయం చేశారు. పార్టీ మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకాష్ అంబేద్కర్ తో ముచ్చటించారు.
Prakash Ambedkar: ఘనంగా సత్కరించిన కేటీఆర్
సమావేశం ముగిసిన అనంతరం వంచిత్ బహుజన్ అగాడీ అధినేత ప్రకాష్ అంబేద్కర్‌ను కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు ప్రత్యేక జ్ఞాపికను బహూకరించి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Epaper: epaper.vaartha.com

