Dailyhunt
కేయూలో ఎలుకల దాడి.. 14 మందికి గాయాలు

కేయూలో ఎలుకల దాడి.. 14 మందికి గాయాలు

వార్త 2 weeks ago

Kakatiya University Rat Attack: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని సమ్మక్క-సారలమ్మ హాస్టల్లో విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు వారిపై దాడి చేశాయి.

ఈ ఘటనలో మొత్తం 14 మంది విద్యార్థులను ఎలుకలు కొరికినట్లు సమాచారం.

Read Also :MLC Vijayashanti: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను గుర్తించి, గౌరవించాలి

 Rat attack at KU.. 14 people injured

Kakatiya University Rat Attack: పలుమార్లు జరుగుతున్న ఎలుకల దాడులు

యూనివర్సిటీలో ఇలా ఎలుకలు విద్యార్థులపై దాడులు చేయడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో కూడా రక్షణ లేకుండా పోయిందని వారు వాపోతున్నారు.

స్పందించాలని వేడుకుంటున్న విద్యార్థులు

హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అమెరికా పర్యటనకు కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha