Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను గుర్తించి, గౌరవించాలి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను గుర్తించి, గౌరవించాలి

వార్త 2 months ago

వారికి పునరావాసం కల్పించాలి.. విజయశాంతి

MLC Vijayashanti: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తూ, వారికి పునరావాసం కల్పించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సోమవారం జరిగిన శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా స్పెషల్ మెన్షన్ల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం లో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామనీ హామీ ఇచ్చామని గుర్తు చేశారు.

Read Also : Telangana VAT Amendment Bill: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

 Justice should be done to the activists: Vijayashanti

MLC Vijayashanti: ఉద్యమకారులకు న్యాయం చేయాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయిందని, ఉద్యమకారులకు 205 న్యాయం జరగడం లేదన్నారు. ఉద్యమకారులకు ప్రయారిటీ ఇస్తామని చెప్పామని ఇపుడు ఉద్యమకారులు అదే విషయాన్ని అడుగుతున్నారని అన్నారు. ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని, అది ఇంకా ఇవ్వలేదన్నారు. ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఉండేవారా? అని విజయశాంతి ప్రశ్నించారు.

ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత

పదవుల కంటే ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు వివిధ సందర్భాలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఉద్యమకారుల విషయంలో ఈ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలుస్తుందని, లేదంటే చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని విజయశాంతి కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఏప్రిల్ లో కొత్త రేషన్ షాపులు ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha