Hyderabad Ganesh festival:హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రధాన మండపాలను దర్శించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి అలాగే బాలాపూర్ గణేష్ మండపాలకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడం ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారింది. సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్, చర్లపల్లి వంటి ప్రధాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేవారు రెండు లేదా మూడు బస్సులు మారాాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే వృద్ధులు, చిన్నపిల్లలు ఈ ప్రయాణ మార్పుల వల్ల ఎంతో అలసిపోతున్నారు. ప్రభుత్వ రవాణా శాఖ ఈ పది రోజుల పాటు ప్రత్యేక బస్సులు కేటాయిస్తే భక్తులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది.
Read also: Shamshabad Bullet Train: శంషాబాద్ సమీపంలో బుల్లెట్ ట్రైన్ హబ్!
TGSRTC buses for Khairatabad Ganesh
వివిధ ప్రాంతాల నుంచి మండపాలకు ప్రయాణ సవాళ్లు
నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి జేబీఎస్ చేరుకునే భక్తులు ఖైరతాబాద్ వెళ్లడానికి మూడు బస్సులు మారుతూ తీవ్ర ప్రయాస పడుతున్నారు. జేబీఎస్ నుంచి ప్యాట్నీ మీదుగా పంజాగుట్ట చేరుకుని అక్కడి నుంచి మరో బస్సు అందుకోవాల్సి వస్తోంది. అలాగే చర్లపల్లి అలాగే ఎంజీబీఎస్ రైల్వే స్టేషన్ల నుంచి కూడా నేరుగా బస్సు సేవలు ఉత్సవ రోజుల్లో లేకపోవడం ప్రతికూలంగా మారింది. వికారాబాద్ ప్రాంతం నుంచి మెహిదీపట్నం వచ్చే వారికి కొన్ని బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ లక్డీకాపూల్ వద్ద దిగి నడవాల్సిన పరిస్థితి నెలకొంది. బాలాపూర్ గణేష్ మండలానికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కోఠి అలాగే పిసల్‌బండ నుంచి కొన్ని సర్వీసులు ఉన్నా బాలాపూర్ క్రాస్‌రోడ్స్ చేరుకున్నాక సుమారు మూడు కిలోమీటర్లు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది.
Hyderabad Ganesh festival:ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు భక్తుల విన్నపాలు
ప్రధాన రవాణా కేంద్రాల నుంచి ఈ పది రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తే ప్రయాణికుల కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. జేబీఎస్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్ అలాగే చర్లపల్లి నుంచి ఖైరతాబాద్ మరియు బాలాపూర్ ప్రాంతాలకు నేరుగా బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. రవాణా శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకుంటే భక్తులకు మెరుగైన ప్రయాణ అనుభవం దొరుకుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి అలాగే రద్దీ నియంత్రణ సులభం అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ లంబోదరుడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
Epaper: epaper.vaartha.com

