Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

వార్త 3 weeks ago

Khairatabad Bypoll: ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ గెలుపును సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నిర్వహించవద్దని కోరుతూ విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, కేసు విచారణ ఆసక్తికరంగా మారింది.

Read Also : New Voter in Telangana : తెలంగాణ SIRలో ఫారం-6 దరఖాస్తులపై ఆసక్తికర గణాంకాలు

 Suspense continues over the Khairatabad by-election.

Khairatabad Bypoll: పిటిషన్‌ తేలే వరకు నోటిఫికేషన్ ఇవ్వం: హైకోర్టుకు తెలిపిన ఈసీ

ఖైరతాబాద్‌ స్థానానికి ఉపఎన్నిక నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (EC) తాజాగా తెలంగాణ హైకోర్టుకు తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తేల్చే వరకు ఉపఎన్నికకు ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వబోమని ఈసీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఈ అంశంపై అధికారికంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను అక్టోబర్‌ 6కి వాయిదా వేసింది.

నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంది: విజయారెడ్డి

తాజాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి.. ఈ న్యాయపోరాటంలో తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదని కోర్టు తేల్చితే, రెండో స్థానంలో ఉన్న తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పిటిషన్‌ తేలకముందే ఉపఎన్నికకు వెళ్తే చట్టపరంగా తప్పు అవుతుందని, దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులు ఉన్నాయని చెప్పారు. తన పిటిషన్‌ను పక్కన పెట్టి ఉపఎన్నికకు ప్రయత్నిస్తే, తగిన కారణాలపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ఉపఎన్నిక నిర్వహించాల్సి వస్తే కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

దానం నాగేందర్ అనర్హతతో ఏర్పడిన ఖాళీ

2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్‌ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఆయన అనర్హతను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఖైరతాబాద్ స్థానం అధికారికంగా ఖాళీ అయింది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైనప్పటికీ, విజయారెడ్డి వేసిన పాత ఎన్నికల పిటిషన్ కారణంగా ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ కోర్టు పరిధిలోనే ఉండిపోయింది.

మెదక్‌లో జర్నలిస్టుల పోరుబాట.. గాంధీ జయంతి నాడు 'డిమాండ్స్ డే'!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha