New Voter in Telangana : తెలంగాణ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో కొత్త ఓటర్ల నమోదుకు ఇప్పటివరకు 4.43 లక్షలకుపైగా ఫారం-6 దరఖాస్తులు అందాయి. అక్టోబర్ 1 నాటికి వచ్చిన అధికారిక గణాంకాల ప్రకారం 4,43,183 మంది కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఉపయోగించే ఫారం-7 ద్వారా 28,753 దరఖాస్తులు వచ్చాయి. పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పుల కోసం ఫారం-8 ద్వారా 3,35,187 దరఖాస్తులు అందాయి. ఫారం-7 దరఖాస్తులపై పరిశీలన, ధ్రువీకరణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు.
KTR: సీఎం రేవంత్ కు థాంక్స్ చెప్పిన కేటీఆర్..ఎందుకంటే !!
New Voter in Telangana
New Voter in Telangana : అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు
తెలంగాణ SIR షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు అక్టోబర్ 7 వరకు దాఖలు చేయవచ్చు. అనంతరం నోటీసులు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగనుంది. తుది ఓటరు జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నారు. SIRలో తెలంగాణలో 73,39,235 మంది ఓటర్లను ASDD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో గుర్తించారు. అయితే ఈ వర్గీకరణలో ఉన్న ఓటర్ల పేర్లపై తదుపరి ప్రక్రియ, క్లెయిమ్స్-అభ్యంతరాల పరిశీలన కొనసాగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం SIR ప్రక్రియ కొనసాగుతుందని, మరోసారి గడువు పొడిగించే ఉద్దేశం లేదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన పత్రాలను సేకరించేందుకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లే విధానాన్ని కూడా అధికారులు అమలు చేస్తున్నారు.

