Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖమేనీ భౌతిక కాయాన్ని ఇన్నాళ్లూ ఎలా భద్రపరిచారో తెలుసా?.. ఆసక్తికర విషయాలు

ఖమేనీ భౌతిక కాయాన్ని ఇన్నాళ్లూ ఎలా భద్రపరిచారో తెలుసా?.. ఆసక్తికర విషయాలు

వార్త 17 hrs ago

Ayatollah Ali Khamenei: ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా ఫిబ్రవరి 28నే ఆయన కన్నుమూశారు.

అయితే, ఆ సమయంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు ఆయన పార్థివ దేహాన్ని అత్యంత సురక్షితమైన కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచారు. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో, వారం రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ అంతిమ యాత్ర కోసం ఇరాన్ ప్రభుత్వం పటిష్టమైన భద్రతతో కూడిన భారీ ఏర్పాట్లు చేసింది.

ఖమేనీ శవపేటిక శుక్రవారం నాటికి రాజధాని టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా సముదాయానికి చేరుకుంది. మూడు రోజుల పాటు ఇక్కడ ప్రజలు, ఉన్నతాధికారులు, సైనిక సిబ్బంది మరియు విదేశీ ప్రతినిధుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. ఆ తర్వాత పవిత్ర నగరం ఖోమ్‌లోనూ, ఇరాక్‌లోని నజాఫ్, కర్బలా పుణ్యక్షేత్రాల్లోనూ ప్రత్యేక సంతాప కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరగా జూలై 9న ఆయన స్వస్థలమైన మషద్‌లోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఖనన ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Mojtaba Khamenei: అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్‌తబా ఖమేనీ హాజరవుతారా?

 Do you know how Khamenei’s mortal remains were preserved all this time?

Ayatollah Ali Khamenei: ఇస్లామిక్ సంప్రదాయాలు.. షియా ధార్మిక నియమాల మినహాయింపు

సాధారణంగా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మరణించిన వారి శవాన్ని 24 గంటలలోపే ఖననం చేయాలి. అలాగే భౌతికకాయం చెడిపోకుండా రసాయనాలతో ఎంబామింగ్ చేయడం కూడా పూర్తిగా నిషిద్ధం. అయితే, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అధినేత ఖమేనీ మృతదేహం విషయంలో మత పెద్దలు మినహాయింపు తీసుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు ఫోరెన్సిక్ మార్చురీలోని రిఫ్రిజిరేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లో (ఫ్రీజింగ్) అత్యంత జాగ్రత్తగా దాచారు. యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో ఖననం ఆలస్యం కావడానికి షియా ధార్మిక నియమాల్లో ప్రత్యేక మినహాయింపులు ఉండటంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతిమ యాత్ర ద్వారా దేశ ఐక్యత చాటేలా ఇరాన్ ప్లాన్

ఈ భారీ అంతిమ యాత్ర ద్వారా దేశ ఐక్యతను, సైనిక శక్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాలని ఇరాన్ యోచిస్తోంది. ఇరాన్ ప్రజలంతా ఈ యాత్రలో పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అంత్యక్రియల కార్యక్రమాలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు చైనా, భారత్ సహా పలు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు. అయితే, భద్రతా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఖమేనీ వారసుడిగా ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

కుకీ దొంగిలించాడని 11 ఏళ్ల ఉద్యోగిని తీసేసిన ఫోర్డ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha