Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరులో సిఐటియు భారీ ధర్నా

నెల్లూరులో సిఐటియు భారీ ధర్నా

వార్త 1 week ago

CITU Protest Nellore:సిఐటియు నేతల హెచ్చరిక. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. జీతాల పెంపుదలకై…. కనీస వేతనం 26,000 అమలు చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు కనీస వేతనాలు సవరించకపోతే పోరాటం ఉధృతి చేస్తామని సిఐటియు నేతల హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరైన రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ మరియు ఆప్కాస్ కార్మికులు మరియు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులు.పాల్గొన్నారు వేతనాలను పెంచాలని కనీస వేతనం 26,000 చేయాలని, నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12వ పి.ఆర్.సిని వెంటనే నియమించాలని, ఆప్కాస్ కార్మికులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపచేయాలని నెల్లూరు జిల్లాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున నినదించింది.

సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. ముందుగా నెల్లూరు విఆర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ప్రదర్శన జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగినది.” చంద్రబాబు – కార్మికులు కు జీతాలు పెంచండి”,”యాజమాన్యాల పక్షాన కాదు- కార్మికుల పక్షాన ఆలోచించండి”అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం కార్మిక సమూహాన్ని ఉద్దేశించి సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు టీవీ వి ప్రసాద్, గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు వేతన సవరణ జరిగి 15 ఏళ్లు పైబడ్డ, కార్మికులు పదేపదే అడుగుతున్నా, పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదని వెంటనే వేతన సవరణ జరపాలని అన్నారు.

Read also: Reliance AP Investment: ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్!

 Protest in Nellore demanding a minimum wage of ₹26,000.

CITU Protest Nellore:జీతాలు పెంచాలని కార్మికుల డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికుల గా, ఔటర్సింగ్ కార్మికులుగా, ఆప్కాస్ కార్మికులుగా చేస్తున్నటువంటి వారికి ఏడుసంవత్సరాలగా జీతాలు పెంపుదల ఆగిపోయిందన్నారు. మునిసిపల్ కార్మికులకు పిఆర్సి తో ముడిపెట్టి అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, ఆ జీతం వాళ్ళ కుటుంబాలు జీవనం సాగించేందుకు తోడ్పడడం లేదన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వేతన సవరణలు జరిపి, జీతాల పెంచుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. వేతన సవరణ జరిగితే ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా యాజమాన్యాలు ఆ వేతనాలను చెల్లిస్తాయని, కానీ ఆ పని చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనకాడతోందన్నారు. అనేక పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి పారిశ్రామిక కార్మికులకు అతి తక్కువ వేతనాలను యాజమాన్యాలు చెల్లిస్తున్నా వారిని నెలేసి అడగలేని పరిస్థితుల్లో జిల్లాలోని లేబర్ అధికారులు తయారయ్యారన్నార. జిల్లాలో 25 వేల మంది గా ఉన్న ఆక్వా పరిశ్రమల పని చేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా కేజీకి రూపాయల లెక్కన ఇస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతన సవరణ చేసి వేతనాలు పెంచకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి నాగేశ్వరరావు, కే పెంచల నరసయ్య,,ఎస్.కె రెహనా బేగం, అల్లాడి గోపాల్, గడ్డం అంకయ్య, ఎన్. సతీష్ కుమార్ కె. సురేష్, మారుబోయిన రాజా, జి శివప్రసాద్, కె.హజరత్తయ్య, సుధాకర్,పి. శ్రీనివాసులు, డి రమణయ్య వివిధ యూనియన్ల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

బాలికను హత్య చేసి, రైలులో తరలించిన ఆటో డ్రైవర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha