Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడుల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల ప్రణాళికను మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
చర్చల కోసం ఇరాన్ ఒక వారం సమయం కోరగా, తాను ఉదారంగా 10 వారాల సమయం ఇస్తానని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Read Also:Iran Ship Attack: హర్ముజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
Donald Trump: ‘పిజ్జా మీటర్’ హెచ్చరిక: యుద్ధానికి పెంటగాన్ సిద్ధం?
ట్రంప్ పది రోజుల గడువు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. గురువారం రాత్రి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ (Pentagon) సమీపంలో భారీ సంఖ్యలో పిజ్జా డెలివరీలు జరిగాయి. దీనిని అంతర్జాతీయంగా ‘పిజ్జా మీటర్’ (Pizza Meter) అని పిలుస్తారు.ఇటీవల వెనుజులాపై దాడికి ముందు రోజు రాత్రి కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో పిజ్జాలు డెలివరీ అయ్యాయి. చర్చలపై ఇరాన్ తనను ఒక వారం సమయం అడిగిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Trump postpones Iran attacks 10 days
కానీ ''నేను మీకు 10 వారాల సమయం ఇస్తాను అని చెప్పాను'' అని ఆయన అన్నారు.హర్మూజ్ జలసంధి నుంచి 10 నౌకలను అనుమతించి ఇరాన్ బహుమతికి ప్రతిగా తాను ఈ ఉదారతను ప్రదర్శించానని ట్రంప్ పేర్కొన్నారు. కానీ, ఇరాన్ సమీపంలో వేలాది అదనపు సైనికులను సమీకరించుకునేందుకు సమయం కోసం ట్రంప్ వేసిన ఒక ఎత్తుగడ కూడా కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. శాంతి చర్చల దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నప్పటికీ.. మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు కల్పిస్తూ పెంటగాన్ ఇప్పటికే పశ్చిమాసియాకు భారీగా సైనిక దళాలను పంపిందని, అదనంగా 10,000 మందిని భూతల దాడులకు పంపాలని కూడా చూస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

