Rahul On Purification Ritual : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన సభా ప్రాంగణాన్ని 'శుద్ధీకరణ' చేయడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.
న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read Also: ssential Commodities: నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల పై మోడీ పై కాంగ్రెస్ సెటైర్
Rahul On Purification Ritual
Rahul On Purification Ritual :ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: రాహుల్
శుద్ధీకరణ అనే పేరుతో దళితులను అపవిత్రులుగా, తాకకూడని వారిగా చిత్రీకరిస్తున్నారని, ఇది అంటరానితనానికి మరొక రూపమని రాహుల్ మండిపడ్డారు.రాజ్యాంగం అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించిందని, ఈ చర్య ముమ్మాటికీ చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై తక్షణమే ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ఘటన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కుల వివక్ష మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. దళితులు అభివృద్ధి చెందడం, ఉన్నత స్థానాల్లో ఉండటం వారికి ఇష్టం లేదని విమర్శించారు.ఇది కేవలం రాజకీయ వివాదం కాదని, దేశంలో నేటికీ కొనసాగుతున్న కుల వివక్షకు నిదర్శనమని చెప్పారు. దళిత విద్యార్థులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, సామూహిక బావుల నుంచి నీళ్లు తీసుకోనివ్వకపోవడం, దళిత పెళ్లికుమారులు గుర్రాలపై ఊరేగేందుకు హెల్మెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు నేటికీ సమాజంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అంబేడ్కర్, గాంధీ, నెహ్రూ రాజ్యాంగ భావజాలానికి, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీల మనువాద ఆలోచనలకు మధ్య భావజాల పోరాటం జరుగుతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

