Andhra Farmers News : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మే 31 నుంచి కాలువలకు నీటి విడుదల
ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన సాగునీటిని అందించేందుకు కాలువలు తెరిచే తేదీలు, నీటి పంపిణీ ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రస్తుతం కాలువల మరమ్మతు పనులు కొనసాగుతున్నందున పరిస్థితులను బట్టి దశలవారీగా వివిధ కాలువలకు నీరు అందించనున్నట్లు తెలిపారు. రైతులు సాగునీటి కొరతతో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Read also: AP Noise Pollution: ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!
Andhra Farmers Newsరైతులకు ముందస్తు సూచనలు
ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతుల కోసం రూ.148 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమావేశంలో కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. అలాగే గోదావరి నది కాలుష్య నివారణకు రూ.100 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుగానే నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.
సాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడతారని తెలిపారు. ఈ నిర్ణయంతో గోదావరి డెల్టా ప్రాంత రైతుల్లో ఆశలు పెరిగాయి. ఖరీఫ్ సాగుకు తగిన నీటి లభ్యత ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం.. మంతెన రామరాజు సంచలన ప్రకటన

