Mohan Babu: ప్రముఖ నటుడు మోహన్‌బాబు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, తుది నిర్ణయాన్ని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
Read Also:AP Govt: రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లోకి రూ. 2,950 కోట్లు.. పెండింగ్ బిల్లుల క్లియర్!
హైకోర్టులో జరిగిన కీలక వాదనలు
తిరుచానూరు పోలీసులు నమోదు చేసిన ఈ కిడ్నాప్ కేసులో ఇరువర్గాల లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించారు. మోహన్‌బాబుకు కిడ్నాప్‌కు సంబంధం లేదని .. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బ తీసేలా కొందరు ఇలా చేస్తున్నారని.. మోహన్‌బాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
అయితే ఈ కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున లాయర్ కూడా వాదించారు. మోహన్‌బాబు కిడ్నాప్ జరిగిన సమయంలో యూనివర్శిటీకి సంబంధించిన సిబ్బందితో మాట్లాడినట్లు ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు ఉన్నాయన్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించొద్దని కోరారు. అలాగే ఈ కేసులో ఏ3గా ఉన్న మంచు విష్ణుకు నోటీసులు విచారణకు పిలిస్తే రాలేదని కూడా కోర్టుకు తెలిపారు. ఈ వాదనల తర్వాత కోర్టు బెయిల్‌పై ఈ నెల 16న తీర్పును ఇవ్వనుంది.
Mohan Babu Bail Update
Mohan Babu Bail Update: అసలేం జరిగిందంటే?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. కాగా వర్సీటీలో యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో దర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని నిర్భంధించి బెదిరించారు. ఈ విషయమై మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బౌన్సర్ల ఆధీనంలో ఉన్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్లతోపాటు వారి వాహనాలను సీజ్ చేసి తిరుపతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హై కోర్టులో విచారణ సాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

