Dailyhunt
టీడీపీ మహానాడు వేదిక ఎక్కడంటే?

టీడీపీ మహానాడు వేదిక ఎక్కడంటే?

వార్త 1 week ago

TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు (Mahanadu) వేదిక కోసం కసరత్తులు ముమ్మరమయ్యాయి. మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న ఈ వార్షిక వేడుకను ఉత్తరాంధ్రలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో, అనువైన స్థలం కోసం అన్వేషణ ప్రారంభమైంది.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

Read Also:Chittoor: ఆపదలో 'శక్తి'గా నిలుద్దాం: విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించిన చిత్తూరు పోలీసులు

TDP Mahanadu 2026: పరిశీలనలో ఉన్న ప్రాంతాలు

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలోని నాలుగు ప్రాంతాలను పార్టీ ముఖ్య నేతలు పరిశీలించారు. రవాణా సౌకర్యాలు, భారీ బహిరంగ సభకు అవసరమైన స్థలం ఇక్కడ అందుబాటులో ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఉన్న అనువైన స్థలాలను కూడా నేతలు తనిఖీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కార్యకర్తలు సులభంగా చేరుకునే అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

 TDP Mahanadu 2026 venue selection updates

నేడు స్వయంగా పల్లా శ్రీనివాసరావు వివిధ సైట్లను సందర్శించి, క్షేత్రస్థాయి సౌకర్యాలను అంచనా వేయనున్నారు. వేదిక ఎంపికలో పార్కింగ్ సౌకర్యం, నీడ, వేల సంఖ్యలో వచ్చే ప్రతినిధులకు భోజన వసతి కల్పించే వీలున్న ప్రాంతాలకే మొగ్గు చూపుతున్నారు.ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 28న ప్రధాన వేడుకలు జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భద్రతాపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో వేదికపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం: శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha