Custard Apple Prices:వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం ఈసారి సీతాఫలాల సాగుపై తీవ్రంగా పడింది. సరైన వర్షాలు కురవకపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో చెట్ల పూత ఎండిపోయి రాలిపోయింది.
ఫలితంగా మార్కెట్‌కు పండ్ల రాక భారీగా తగ్గిపోయి, ధరలు విపరీతంగారి పెరిగాయి.
El Niño effect: Custard apple yield declines.
మార్కెట్‌పై ప్రభావం – తగ్గిన దిగుబడి
సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు సీతాఫలం సీజన్ సాగుతుంది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, వరంగల్, నిజామాబాద్, నల్గొండతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం, మోజన్‌జాహి మార్కెట్లకు సుమారు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల సరుకు వచ్చేది.
El nino impact: నీళ్లు లేక బీడువారిన వేలాది ఎకరాలు
కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండల ప్రభావం వల్ల దిగుబడి ఏకంగా 60 నుంచి 70 శాతం వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రోజుకు 150 మెట్రిక్ టన్నుల వరకు పండ్లు రాగా, ప్రస్తుతం కేవలం 80 మెట్రిక్ టన్నుల లోపే వస్తున్నాయి. దీనివల్ల హైదరాబాద్ మార్కెట్లలో మొత్తం 30,000 మెట్రిక్ టన్నుల వ్యాపారం జరిగే చోట, ఈసారి కేవలం 12,000 మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Custard Apple Prices:సామాన్యులకు అందని ధరలు
మార్కెట్‌కు వస్తున్న పండ్లలో నాణ్యత పూర్తిగా కొరవడిందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పండ్లయినా సరే రూ. 50కి మూడేసి చొప్పున అమ్ముతున్నారని, కిలో రూ. 200 నుంచి రూ. 300 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. తక్కువ పరిమాణంలో వస్తున్నప్పటికీ సరైన నాణ్యత గానీ, తగిన ధర గానీ లభించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీపావళి పండుగ సమయం దగ్గరపడుతున్నప్పటికీ మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో సీతాఫలాలు రాకపోవడంతో ప్రియులు నిరాశ చెందుతున్నారు.
Epaper: epaper.vaartha.com

