Keera dosakaya: బరువు తగ్గడానికి, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది డైట్‌లో కీరదోసకాయను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుంటారు. ఇందులో ఫైబర్, నీటి శాతం పుష్కలంగా ఉన్న మాట నిజమే అయినప్పటికీ..
ఇది అందరికీ ఆరోగ్యకరం కాదని, కొందరికి దీనివల్ల సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సున్నితమైన జీర్ణకోశం ఉన్నవారికి కీరదోసకాయ అంతగా సరిపడదు. అలాంటి వారు దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం , గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Read also: Rice : అన్నం తింటే లావవుతారనే భయం వద్దు.. ఈ చిన్న మార్పులు చేస్తే చాలు!
Are you eating a lot of cucumbers? Well, it doesn’t suit everyone!
Keera dosakaya: చేదు కీరదోసతో మరింత ప్రమాదం!
కొన్ని కీరదోసకాయలు తినేటప్పుడు చేదుగా ఉంటాయి. ఇలా చేదుగా ఉండే దోసకాయల్లో ‘కుకుర్బిటాసిన్స్‘ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరితే, వికారం (Nausea) వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి కారణమవుతాయి. అందుకే చేదుగా ఉన్న కీరదోసకాయలను అస్సలు తినకూడదు. మార్కెట్ నుండి తెచ్చిన కీరదోసకాయలను సరిగా కడగకుండా తింటే, వాటిపై ఉండే బ్యాక్టీరియా వల్ల ‘ఫుడ్ పాయిజనింగ్’ అయ్యే ప్రమాదం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కిడ్నీ (మూత్రపిండాల) సమస్యలతో బాధపడేవారు కీరదోసకాయను తమ ఆహారంలో చేర్చుకునే ముందు ఖచ్చితంగా వైద్యుల సూచనలు , సలహాలు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా? అసలు నిజం ఇదే !!

