Kiran Abbavaram Reality Movie: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకేసారి ద్విపాత్రాభినయం తరహాలో సరికొత్త బాధ్యతను భుజాన వేసుకున్నారు. నటుడిగానే కాకుండా తన తదుపరి చిత్రంతో దర్శకుడిగా కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.
కొంతకాలంగా 'KA13' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'రియాలిటీ' అనే ఆసక్తికరమైన శీర్షికను ఖరారు చేశారు.
The Game Changers reality show: మాధవన్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి హోస్ట్‌గా!
Kiran Abbavaram Reality Movie: టైటిల్ గ్లింప్స్ & డిసెంబర్ 25న క్రిస్మస్ విడుదల
చిత్ర బృందం 'రియాలిటీ' సినిమా టైటిల్ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ టైటిల్ గ్లింప్స్ సినిమా ముఖ్య ఉద్దేశాన్ని చాటిచెబుతోంది. "చిన్న చిన్న ఆనందాలే… హై మూమెంట్స్" అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో పాటు "మన కథ. మన రియాలిటీ" అనే క్యాప్షన్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ప్రతి ఒక్కరూ తమ జీవితానికి కనెక్ట్ అయ్యేలా సహజమైన కథాంశంతో ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు తెలుస్తోంది.
బలమైన తారాగణం & సాంకేతిక నిపుణులు
జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన దేవికా భట్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రల్లో శరత్ కుమార్, సాయికుమార్, రమేశ్ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.
తనదైన శైలిలో యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ఈ 'రియాలిటీ' చిత్రంతో దర్శకుడిగా కూడా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా సాగుతున్న షూటింగ్ పనులను పూర్తి చేసి క్రిస్మస్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.
Epaper: epaper.vaartha.com

