Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కివీస్‌తో తొలి టీ20 షురూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

కివీస్‌తో తొలి టీ20 షురూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

వార్త 2 days ago

Ind vs NZ 1st T20: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఘనంగా ప్రారంభమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన గత సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా, ఈ కివీస్ పర్యటనలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలని పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగింది.

Read Also : IND vs NZ T20: నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20

 First T20 against the Kiwis begins… India wins the toss and elects to bowl

Ind vs NZ 1st T20: తుది జట్టులో కీలక మార్పులు.. మయాంక్, నితీశ్‌లకు అవకాశం

ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ ఎవెన్ (Playing XI) లో కొన్ని కీలక మార్పులు చేసింది. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ప్రతిభావంతుడైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలకు తుది జట్టులో అవకాశం కల్పించింది. వీరిద్దరి రాకతో భారత పేస్, ఆల్ రౌండ్ విభాగం మరింత పటిష్ఠంగా మారింది. అయితే, ఈ ఇద్దరికి చోటు దక్కడంతో ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబే బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అలాగే ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతుండగా.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ మ్యాచ్‌లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, మిచెల్ శాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు కూడా ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ వంటి స్టార్ ఆటగాళ్లతో అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది.

తుది జట్లు

  • భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
  • న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. వారితోనే టీమిండియాకు డేంజర్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha