Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
న్యూజిలాండ్‌తో తొలి టీ20.. వారితోనే టీమిండియాకు డేంజర్‌

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. వారితోనే టీమిండియాకు డేంజర్‌

వార్త 2 days ago

IND vs NZ 1st T20: స్వదేశంలో వెస్టిండీస్‌తో పొట్టి సమరాన్ని విజయవంతంగా ముగించిన భారత టీ20 జట్టు, వారం వ్యవధిలోనే మరో కఠినమైన సవాల్‌కు సిద్ధమైంది.

ఈసారి భౌగోళికంగా, సీజన్ పరంగా పూర్తిగా భిన్నమైన న్యూజిలాండ్ వాతావరణంలో కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేవనుంది. నేడు జరిగే తొలి టీ20లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

IPL 2027: ఢిల్లీ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా అమిత్ మిశ్రా

స్వల్ప విరామం.. భిన్నమైన వాతావరణ సవాళ్లు

టీమిండియాలో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే గతంలో న్యూజిలాండ్ మైదానాల్లో ఆడిన అనుభవం ఉండటం గమనార్హం. అంతేకాకుండా, వెస్టిండీస్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే సుదీర్ఘ ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవడంతో ఆటగాళ్లకు సరైన విశ్రాంతి గానీ, స్థానిక పరిస్థితులకు అలవాటుపడే ప్రాక్టీస్ గానీ దక్కలేదు. విండీస్ సిరీస్‌తో పోలిస్తే ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానుండటంతో వైభవ్ మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబేలతో బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. నమన్ ధీర్ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఇక పిచ్ పరిస్థితులను బట్టి వరుణ్ చక్రవర్తి లేదా ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరికి మాత్రమే చోటు దక్కవచ్చు.పూర్తి బలగంతో కివీస్ సిద్ధంమరోవైపు, టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత మళ్లీ భారత్‌ను ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ ఈసారి ఏమాత్రం తగ్గకూడదని భావిస్తోంది. వివిధ గ్లోబల్ లీగ్స్‌తో బిజీగా ఉండే కీలక ఆటగాళ్లంతా చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి పూర్తి జట్టుగా ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు.

వారితోనే డేంజర్‌

ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ వంటి విధ్వంసకర ఓపెనర్లు కివీస్‌ జట్టులో ఉన్నారు. వారు చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. అంతేకాకుండా కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్‌లతో కూడిన మిడిలార్డర్ కివీస్‌కు ప్రధాన బలం. పదునైన నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.

పిచ్ అండ్‌ వాతావరణ పరిస్థితులు

రాత్రి పూట మ్యాచ్ జరగనుండటంతో అక్కడి చలి వాతావరణం, కొత్తగా తయారు చేసిన రెడీమేడ్ పిచ్‌లు స్వింగ్ బౌలింగ్‌కు బాగా సహకరించనున్నాయి. కివీస్ గడ్డపై జరిగిన గత 8 అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కసారి కూడా 200 ప్లస్ స్కోరు నమోదవలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లలోనూ భారీ స్కోర్ల కంటే బౌలర్ల ఆధిపత్యమే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

తుది జట్లు(అంచనా)

భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీశ్‌ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.

నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha