Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కీవ్‌పై రష్యా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి.. 9 మంది మృతి

కీవ్‌పై రష్యా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి.. 9 మంది మృతి

వార్త 5 days ago

Ukraine Russia War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా సైన్యం శనివారం ఉదయం అత్యంత భీకరమైన దాడికి పాల్పడింది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఏకకాలంలో జరిపిన ఈ వరుస దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉదయం పూట ప్రజలు నిద్రలేచే సమయానికి జరిగిన ఈ దాడులతో కీవ్ నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. రష్యా సేనలు జరిపిన ఈ విణాశకర దాడితో పలు ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టం వాటిల్లింది.

సోలోమియానెస్కీ మరియు డర్నిట్స్కీ జిల్లాలపై తీవ్ర ప్రభావం

ఈ దాడుల కారణంగా కీవ్‌లోని పలు నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలోమియానెస్కీ జిల్లాలో ఉన్న ఒక ఐదు అంతస్తుల నివాస భవనంపై క్షిపణి శకలాలు పడటంతో భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదకర పరిస్థితుల మధ్య అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది ఆ భవనంలో చిక్కుకున్న 35 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, డర్నిట్స్కీ జిల్లాలో జరిగిన మరో దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 14 మంది గాయపడ్డారు. ఇక్కడ ఇళ్లు పూర్తిగా కూలిపోయి భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Ukraine Russia War: రష్యా లక్ష్యాలు మరియు సైనిక చర్యల ప్రకటన

కీవ్‌పై జరిగిన ఈ వినాశకర దాడుల వెనుక తమ వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నట్లు రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది. రాజధాని కీవ్ సమీపంలో ఉన్న కీలకమైన సైనిక పారిశ్రామిక కేంద్రాలను, అలాగే లాజిస్టిక్ హబ్‌లను (రవాణా కేంద్రాలను) లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు నిర్వహించినట్లు రష్యా అధికారికంగా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, రష్యా ఉద్దేశపూర్వకంగానే జనసాంద్రత కలిగిన ప్రాంతాలు మరియు కీలక మౌలిక వసతులను టార్గెట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. హౌతీలపై భారీ ఆపరేషన్‌కు సౌదీ సిద్ధం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha