Dailyhunt
KKR కోచ్‌గా మళ్లీ బ్రెండన్ మెకల్లమ్? కెవిన్ పీటర్సన్ సంచలన పోస్ట్

KKR కోచ్‌గా మళ్లీ బ్రెండన్ మెకల్లమ్? కెవిన్ పీటర్సన్ సంచలన పోస్ట్

వార్త 2 weeks ago

Brendon McCullum: ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలవడంతో, టీమ్ మేనేజ్‌మెంట్ మరియు కోచింగ్ స్టాఫ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చేసిన ఒక ప్రకటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also: Smriti Mandhana: హిట్‌మ్యాన్‌ను అధిగమించిన మంధాన..టీ20లో సరికొత్త అధ్యాయం

పీటర్సన్ జోస్యం: “మెకల్లమ్ ఈజ్ బ్యాక్”

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు మూడు ఫార్మాట్లలో హెడ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్, వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి మళ్లీ కేకేఆర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపడతారని పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “వచ్చే సీజన్‌లో బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ కోచ్‌గా వస్తారు.. కావాలంటే ఈ పోస్ట్‌ను ఇప్పుడే బుక్‌మార్క్ చేసుకోండి” అంటూ పీటర్సన్ చాలా కాన్ఫిడెంట్‌గా సవాల్ విసిరారు.

 Brendon McCullum KKR Coach

Brendon McCullum KKR Coach: విఫలమైన అభిషేక్ నాయర్ వ్యూహాలు?

2025 అక్టోబర్‌లో చంద్రకాంత్ పండిట్ స్థానంలో అభిషేక్ నాయర్‌ను కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమించారు.కేకేఆర్ అకాడమీతో సుదీర్ఘ అనుబంధం ఉండటం, ప్లేయర్లతో మంచి సంబంధాలు ఉండటంతో నాయర్ సక్సెస్ అవుతారని అందరూ భావించారు.ఈ సీజన్‌లో కేకేఆర్ ఇప్పటివరకు కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించి టేబుల్ అడుగున ఉంది. టీమ్ ఎంపికలో మరియు బ్యాటింగ్ ఆర్డర్ మార్పులలో నాయర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ ‘బాజ్‌బాల్’ మ్యాజిక్ అవసరమా?

గతంలో మెకల్లమ్ కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్ ఫైనల్స్ వరకు వెళ్ళింది. మెకల్లమ్ మార్క్ అగ్రెసివ్ క్రికెట్ (బాజ్‌బాల్) ప్రస్తుతం కేకేఆర్‌కు ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్ బోర్డుతో (ECB) ఒప్పందంలో ఉన్న మెకల్లమ్ ఐపీఎల్‌లోకి మళ్లీ రావడం సాధ్యమేనా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.ఒకవేళ మెకల్లమ్ రాక నిజమైతే, అది కేకేఆర్ జట్టులో మళ్లీ కొత్త వెలుగులు నింపుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పోలీసుల భారీ భద్రత.. ఈ వస్తువులకు అనుమతి లేదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha