Kodangal Temple: వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో వెలిసిన మహాలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం ఇకపై కొత్త శోభతో మెరిసిపోనుంది. శిథిలావస్థకు చేరిన ఈ పురాతన కట్టడాన్ని అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.110 కోట్లు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని తలపించేలా కృష్ణశిలలతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. భక్తుల సౌకర్యం కోసం సుమారు 5.63 ఎకరాల విస్తీర్ణంలో పనులు వేగంగా జరుగుతున్నాయి.
Read also: TTD Donations: శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్‌కు భక్తుడి భారీ విరాళం
Kodangal Venkateswara Temple Design
Kodangal Temple: అత్యాధునిక వసతులు
ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గర్భాలయం పక్కనే మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి సన్నిధులను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మిస్తున్నారు. ఆలయ తూర్పు దిశలో ఐదంతస్తుల భారీ రాజగోపురం భక్తులకు స్వాగతం పలకనుంది. కేవలం ఆలయమే కాకుండా రూ.20 కోట్లతో పుష్కరిణి, కళ్యాణకట్ట, అన్నదాన సత్రం వంటి వసతులు కల్పిస్తున్నారు. మాడ వీధుల నిర్మాణం ద్వారా భక్తులకు అచ్చం తిరుమలలో ఉన్న అనుభూతిని అందించనున్నారు.
18 నెలల్లో పూర్తి కానున్న పనులు
వచ్చే ఏడాదిన్నర కాలంలోనే ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం భక్తుల కోసం బాలాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం భవిష్యత్తులో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది. పరిపాలన పనులను కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే అటు కర్ణాటక ఇటు తెలంగాణ భక్తులకు కొడంగల్ అద్భుత ఆధ్యాత్మిక నిలయంగా మారుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

