Nellore Crime: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. గండవరం - పెద్దపుత్తేడు గ్రామాల మధ్య రహదారిపై ఇద్దరు యువకులు దారుణంగా హత్య చేయబడి కనిపించడం ఆందోళనకు గురిచేసింది.
ప్రయాణికులు మృతదేహాలను గమనించి వెంటనే కొడవలూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ దుర్గాప్రసాద్ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల గుర్తింపు పోలీసుల వివరాల ప్రకారం, మృతులు దగదర్తి మండలం పెద్దపుత్తేడు గ్రామానికి చెందిన వెంకటేష్ (29), సంఘం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాల వెంకయ్య (28)గా గుర్తించారు. ఇద్దరిపై ఇనుప రాడ్లు లేదా పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు గాయాల ఆధారంగా తెలుస్తోంది.
Read also: Nalanda Temple Stampede: శీతల మాత ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

Horrific Incident in Nellore District: Brutal Murder of Two Youths
Nellore Crime: ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమా?
ఈ జంట హత్యల వెనుక అక్రమ సంబంధాలు లేదా పాత కక్షలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు వెంకటేష్ వివాహితతో సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే ఈ ఘటనకు దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలానికి క్లూస్ టీమ్. చేరుకుని ఆధారాలు సేకరించింది. నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సౌజన్య, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, హత్యలకు గల అసలు కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం. త్వరలోనే నిజాలు వెలుగులోకి తీసుకువస్తాం” అని తెలిపారు. మృతులు గడ్డి మిషన్ ట్రాక్టర్కు డీజెల్ నింపేందుకు గండవరం సబ్స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేసి తిరిగి ప్రయాణించే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

