Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లి పక్కనే ఉన్న బిడ్డను బలి తీసుకున్న చిరుతపులి

తల్లి పక్కనే ఉన్న బిడ్డను బలి తీసుకున్న చిరుతపులి

వార్త 2 months ago

Jalgaon Leopard Incident: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా మమల్దే గ్రామ సమీపంలో గుండెలనిలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుబయట కన్నతల్లి పక్కన నిశ్చింతగా నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఒక క్రూరమైన చిరుతపులి ఎత్తుకెళ్లింది.

తెల్లవారుజామున నిద్రలేచిన తల్లికి పక్కన బిడ్డ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి చుట్టుపక్కల వెతకగా, సమీపంలోని పొలాల్లో చిన్నారి శరీర అవశేషాలు లభ్యమవ్వడం అందరినీ కలిచివేసింది.

Read Also :Visakhapatnam District Court: అప్పుల బాధ తాళలేక కోర్టులోనే వ్యాపారి ఆత్మహత్యాయత్నం

 Leopard carries away sleeping child.

పొలాల్లో లభ్యమైన శరీర అవశేషాలు.. చిరుత దాడి నిరూపణ

సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ మరియు పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షించారు. పొలాల్లో లభించిన ఆనవాళ్లు, పాదముద్రల ఆధారంగా అది చిరుతపులి దాడేనని అధికారులు ధృవీకరించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి వేళల్లో అడవి నుంచి చిరుత జనవాసాల్లోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.

Jalgaon Leopard Incident: భయాందోళనలో గ్రామస్తులు.. అటవీ శాఖ అప్రమత్తం

ఈ దారుణ ఘటనతో మమల్దే గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మహేశ్వరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha