Nellore Duvvuru Family Suicide Case: ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, మనసును కలచివేసే ఘోర ఘటన వెలుగుచూసింది.
“మా కొడుకు చాలా అమాయకుడు.. మేము లేకుండా వాడు ఒంటరిగా బతకలేడు” అంటూ ఒక రిటైర్డ్ టీచర్ సుసైడ్ నోట్ రాసి, భార్య, కొడుకులకు ఉరివేసి.. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సంగం మండలం దువ్వూరు గ్రామంలో జరిగిన ఈ సామూహిక ఆత్మహత్యల ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని నింపింది. ముగ్గురి కాళ్లు, చేతులు కట్టేసి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించడం ఈ ఘటనలోని తీవ్రతను తెలియజేస్తోంది.
Read Also :Nellore Crime:నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!
అసలేం జరిగింది? - మామిడి పండ్ల తెచ్చిన సోదరికి షాక్
Retired Teacher Suicide Note
దువ్వూరు గ్రామానికి చెందిన చీరాల మధుసూదన్ రావు (65) రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయన తన భార్య రత్నావళి (60), కొడుకు సాయిసుకృత్ (26) లతో కలిసి నివసిస్తున్నారు. మధుసూదన్ రావు ఐదేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ పొందారు.సోమవారం నాడు మధుసూదన్ రావు సోదరి దొరసానమ్మ, ఆయన అడిగారని మామిడి పండ్లు తీసుకుని వారి ఇంటికి వచ్చింది. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఘోరం నడుస్తోంది. హాల్లో మధుసూదన్ రావు, రత్నావళి మృతదేహాలు, దేవుడి గదిలో కుమారుడు సాయిసుకృత్ మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. పైగా ముగ్గురి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉండటాన్ని గమనించిన దొరసానమ్మ భయంతో కేకలు వేస్తూ పోలీసులకు సమాచారం అందించింది.
ఆత్మహత్యకు దారితీసిన కారణం ఇదే
మృతుడు సాయిసుకృత్ తిరుపతిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ కంపెనీ కొంతకాలంగా అతనికి జీతం ఇవ్వలేదు. కొడుకు జీతం విషయమై తండ్రి మధుసూదన్ రావు సదరు కంపెనీకి వెళ్లి నిలదీశారు. అయితే కంపెనీ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోగా.. “మీ అబ్బాయి పనితీరు అస్సలు బాగాలేదు, అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి” అని అవమానకరంగా మాట్లాడి పంపించేశారు.ఈ ఘటనతో మధుసూదన్ రావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వయసు పైబడుతుండటంతో తాము మానసికంగా, శారీరకంగా బలహీనపడ్డామని.. తమ తర్వాత అమాయకుడైన కొడుకు భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే కుటుంబంతో సహా తనువు చాలించాలని దారుణ నిర్ణయం తీసుకున్నారు.
Nellore Duvvuru Family Suicide Case: డెత్ నోట్‌లో సంచలన విషయాలు - ఆస్తి రెడ్ క్రాస్‌కు విరాళం
ఘటనా స్థలంలో పోలీసులు మధుసూదన్ రావు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భార్య, కుమారుడి ఆఖరి కోరిక మేరకే ఈ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకున్న ఆస్తులను ఎవరెవరికి ఇవ్వాలో లేఖలో స్పష్టంగా రాసిపెట్టారు. అందులో కొంత భాగాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ (Red Cross) సంస్థకు విరాళంగా ఇవ్వడం గమనార్హం. తాము చనిపోయిన తర్వాత అంత్యక్రియల ఖర్చుల కోసం ఇతరులపై భారం పడకూడదని భావించిన మధుసూదన్ రావు.. తన మరో సోదరికి ముందే ఆన్‌లైన్ ద్వారా డబ్బులు కూడా పంపినట్లు పోలీసులు గుర్తించారు. మధుసూదన్ రావు, రత్నావళి దంపతులకు పిల్లలు లేకపోవడంతో సాయిసుకృత్‌ను చిన్నప్పుడే దత్తత తీసుకుని ప్రాణంగా పెంచుకున్నారు. కొడుకుపై మితిమీరిన ప్రేమే, చివరకు ఆ కుటుంబం అంతం కావడానికి కారణమైందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

