Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొడుకుల రాక్షసత్వం.. మనస్తాపంతో కన్నతల్లి ఆత్మహత్య

కొడుకుల రాక్షసత్వం.. మనస్తాపంతో కన్నతల్లి ఆత్మహత్య

వార్త 1 month ago

KPHB Mother Suicide: ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన కొడుకులే చివరికి ఆ తల్లికి తీరని వేదన మిగిల్చారు.చేతికి అందివచ్చి ఆసరాగా నిలవాల్సిన కొడుకులు తప్పుదారిలో నడవడంతో పాటు అమానుషంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.

రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామానికి చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధ 45 తన కుమారుల ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తూ చివరకు ప్రాణాలు తీసుకుంది.

కొన్నేళ్ల కిందట కుటుంబంలో చోటుచేసుకున్న ఘోరం ఆ తల్లి జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సుధ పెద్ద కొడుకు కరడుగట్టిన నేరస్థుడిగా మారి, సొంత తండ్రినే దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో అతను ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. భర్తను కోల్పోయి, పెద్ద కొడుకు జైలుపాలు కావడంతో సుధ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తూ, అక్కడే ఒక చిన్న గదిలో జీవనం సాగించడానికొచ్చింది.

Read Also : Karachi Child Crime: గుండెను పిండెసే ఘటన.. పసికందు పై కామాంధుడి అత్యాచారం

 Sons’ cruelty… Mother commits suicide out of anguish.

KPHB Mother Suicide: గంజాయికి బానిసైన చిన్న కొడుకు..

పెద్ద కొడుకు జైలుపాలైనా, మిగిలిన చిన్న కొడుకైనా తనకు అండగా ఉంటాడని ఆ తల్లి ఆశపడింది. కానీ, ఆ చిన్న కొడుకు కూడా గంజాయి మహమ్మారికి బానిసయ్యాడు. నిత్యం మత్తులో ఊగుతూ, జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం కన్నతల్లిని వేధించడం, భౌతికంగా హింసించడం పరిపాటిగా మార్చుకున్నాడు. రోజూ డబ్బుల కోసం తల్లిని వేధిస్తూ జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశాడు.

మనోవేదనతో ఉరివేసుకుని ఆత్మహత్య

ఒక కొడుకు తండ్రిని చంపి జైలుపాలైతే, మరో కొడుకు మత్తుపదార్థాలకు బానిసై రోజూ నరకయాతనకు గురిచేస్తుండటంతో ఆ తల్లి పూర్తిగా కుంగిపోయింది. శ్రమించి సంపాదించే జీవనంలో నెమ్మదిగా సంతోషం కరువై, కొడుకుల అమానుష ప్రవర్తనతో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. ఆరని గుండెకోత, నిరంతరం ఎదుర్కొంటున్న మానసిక వేదనను భరించలేక చివరికి తాను నివసిస్తున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఇండిపెండెన్స్ డే ఆటల్లో ప్రమాదం.. మూడో తరగతి చిన్నారి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha