Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమానంలో వేపింగ్ చేస్తూ దొరికిపోయిన చాహల్? వైరల్ అవుతున్న వీడియో!

విమానంలో వేపింగ్ చేస్తూ దొరికిపోయిన చాహల్? వైరల్ అవుతున్న వీడియో!

వార్త 2 weeks ago

Yuzvendra Chahal: పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమాన ప్రయాణంలో వేపింగ్ (ఈ-సిగరెట్) చేసినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి.అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు పంజాబ్ కింగ్స్ జట్టు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన సహచరులతో కలిసి సరదాగా చేస్తున్న వీడియోలో విండో సీటులో కూర్చున్న యుజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నాడు.

Read Also:RCB vs LSG IPL Updates: మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీ.. వర్షంతో ఆగిన ఆట!

అర్ష్‌దీప్ సింగ్,శశాంక్ సింగ్ మాట్లాడుతుండగా, చాహల్ తన చేయి అడ్డుపెట్టుకుని ఏదో నోటి దగ్గర పెట్టుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఇది వేపింగ్ (Vaping) అని నెటిజన్లు ఆరోపిస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. వివాదం రేగడంతో అర్ష్‌దీప్ ఆ వీడియోను ఎడిట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేసినట్లు సమాచారం.

 Yuzvendra Chahal Vaping

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానాల్లో ధూమపానం లేదా వేపింగ్ చేయడం పూర్తిగా నిషేధం.నిబంధనలను ఉల్లంఘించిన ప్రయాణికులపై విమానయాన సంస్థలు ఎటువంటి విచారణ లేకుండానే 30 రోజుల పాటు ప్రయాణ నిషేధాన్ని విధించే అధికారం కలిగి ఉన్నాయి.సాధారణంగా ఇలాంటి దుష్ప్రవర్తనపై ఒక కమిటీని నియమించి, ఆరోపణలు నిర్ధారణ అయిన తర్వాతే తుది చర్యలు తీసుకుంటారు.

ఐపీఎల్‌లో వరుస వేపింగ్ వివాదాలు

క్రికెటర్లు బహిరంగంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా వేపింగ్ చేస్తూ దొరికిపోవడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి.ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ తరహా క్రమశిక్షణారాహిత్య చర్యలపై బీసీసీఐ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసింది

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మిచెల్ మార్ష్ విధ్వంసం: బెంగళూరు ముందు భారీ లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha