Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోకాపేటలో BRS ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అరెస్ట్

కోకాపేటలో BRS ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అరెస్ట్

వార్త 3 weeks ago

MLC Naveen Reddy Arrested: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగళవారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలింపు

నివాసంలో అదుపులోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ఆయన పాత్ర, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

MLC Naveen Reddy Arrested: రాష్ట్ర రాజకీయాల్లో పెరుగుతున్న దుమారం

ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అరెస్టవుతుండటంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha