Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

వార్త 3 weeks ago

Telangana Assembly: తెలంగాణ శాసనసభలో మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై సభ ప్రారంభమైన వెంటనే వాతావరణం వేడెక్కడంతో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.

అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

స్పీకర్‌ను నిలదీసిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు

ఈ ఘటనపై బీఆర్ఎస్ ప్రముఖ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో మాట్లాడారు. మహిళా సభ్యులపై ఇంత జరుగుతున్నా స్పీకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తూ, “ఇదేమైనా కౌరవ సభనా?” అంటూ ఆయన నిలదీశారు. అసెంబ్లీ వేదికగా మహిళా ప్రజాప్రతినిధులపై భౌతిక దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సభలో పట్టుబట్టారు.

సబిత, సునీత నాకు తోబుట్టువుల్లాంటివారు: స్పీకర్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha