Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోకాపేటలో హైడ్రా రూ. 4,117 కోట్ల విలువైన భూములు స్వాధీనం

కోకాపేటలో హైడ్రా రూ. 4,117 కోట్ల విలువైన భూములు స్వాధీనం

వార్త 2 months ago

Hydra seizes lands in Kokapet: హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ భూములను మింగేస్తున్న అక్రమార్కుల గుండెల్లో 'హైడ్రా' (HYDRAA) మరోసారి వణుకు పుట్టించింది.

నగరంలోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్‌గా పేరొందిన కోకాపేట, శేరిలింగంపల్లి పరిసరాల్లో సాగుతున్న వేల కోట్ల రూపాయల భూదందాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నిన్న నగరం నలువైపులా ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించిన హైడ్రా బృందాలు.. బడా రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలను బట్టబయలు చేస్తూ ఏకంగా రూ. 4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువుకు సంబంధించిన (FTL) భూములను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ. 150 కోట్లకు పైగా పలికే కోకాపేట ప్రాంతంలో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు చేసిన భారీ అక్రమాలు ఈ దాడుల్లో వెలుగుచూశాయి. ఇక్కడి ‘కొత్తచెరువు’ పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) పరిధిలోని 1.09 ఎకరాల చెరువు భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది.

Read Also: Harish Rao Siddipet Chinnamandem Visit:ఇసుక రవాణా ఆపేసి.. ఆ లారీలను వడ్ల కోసం వాడండి!

 Hydra seizes lands in

Hydra seizes lands in Kokapet: ప్రజావాణిలో బాధితులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా

అక్కడ ‘గోల్డ్‌ఫిష్ కాలనీ’ పేరుతో లగ్జరీ విల్లాలను నిర్మించడమే కాకుండా, మిగిలిన చెరువు భాగాన్ని మట్టితో పూడ్చివేసి నివాసితుల కోసం విలాసవంతమైన గార్డెన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులను కూడా ఏర్పాటు చేసింది. ప్రజావాణిలో బాధితులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా రంగంలోకి దిగింది. శాటిలైట్ రికార్డులను పరిశీలించి అది చెరువు భూమి అని పక్కాగా నిర్ధారించుకున్నాక, భారీ జెసిబిలతో అక్రమ కట్టడాలను, స్పోర్ట్స్ కోర్టులను నేలమట్టం చేసింది. ఇదే ప్రాంతంలోని ‘పెద్దచెరువు’ పరిధిలో బహుళ అంతస్తుల భవనాల కోసం ఆక్రమించిన సుమారు 22 ఎకరాల విలువైన స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క కోకాపేటలోనే రక్షించిన భూముల మార్కెట్ విలువ రూ. 3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లారీలు రావు మిల్లర్లు కొనరు అని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతన్నలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha