Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లారీలు రావు మిల్లర్లు కొనరు అని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతన్నలు

లారీలు రావు మిల్లర్లు కొనరు అని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతన్నలు

వార్త 2 months ago

Medak News: ఆరు కాలం కష్టించి పండించిన వారి ధాన్యాన్ని అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లారీలు రావు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ కౌడిపల్లి మండల పరిధిలోని వెంకటరావుపేట్ గేట్లు వద్ద 725 డి ప్రధాన రహదారిపై రైతన్నలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమం దాదాపు రెండు గంటలసేపు కొనసాగిన సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం పట్ల రైతన్నలు ఆగ్రహానికి లోనయ్యారు.

Read Also :Harish Rao: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయకుంటే ఖర్గే ఇంటి ముందే ధర్నా!

 Outraged Farmers Block NH 725-D at Kowdipally Over Delays in Paddy Procurement & Lack of Trucks

Medak News: స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని రైతన్నలను శాంతింప చేయడానికి ప్రయత్నించగా స్థానిక ఎమ్మార్వో డి ఎం ఎస్ ఓ లు వచ్చి హామీ ఇస్తే తప్ప ధర్నా విరమింప చేయమని రైతన్నలు భీష్మించి కూర్చున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికారులకు మిల్లర్లు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వాళ్లు అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతుల పండించిన ధాన్యాన్ని చివరి గింజలకు కొనుగోలు చేయాలని గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు సుమారుగా రెండు గంటల పాటు కొనసాగిన ధర్నా రాస్తారోకోకు జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు స్థానిక ఎస్సై అమరేందర్ రెడ్డి ప్రయాణికుల ఇబ్బందులను రైతులకు తెలియజేసి ఎట్టకేలకు ధర్నాను శాంతింప చేశారు ఈ ధర్నా రాస్తారోకో లో వెంకటరావుపేట్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం.. తడిసిముద్దైన వరి ధాన్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha